Corona Virus: కరోనాపై కేంద్ర హోం శాఖ కీలక ఆదేశాలు

nda govt on corona virus

  • భారత్‌లో పెరుగుతున్న కరోనా అనుమానిత కేసులు
  • అప్రమత్తమైన కేంద్ర హోం శాఖ
  • విమానాశ్రయాల్లో కరోనా స్క్రీనింగ్‌ కేంద్రాల ఏర్పాటు తప్పనిసరి

భారత్‌లో కరోనా అనుమానిత కేసులు పెరుగుతుండడంతో కేంద్ర హోం శాఖ అప్రమత్తమైంది. విమానాశ్రయాల్లో కరోనా స్క్రీనింగ్‌ కేంద్రాల ఏర్పాటు తప్పనిసరి చేయాలని సూచించింది. చైనా, సింగపూర్, మలేషియా, ఇండొనేషియాతో పాటు పలు దేశాల నుంచి వచ్చే వారిని తప్పనిసరిగా పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే, ప్రయాణికుల పూర్తి వివరాలను నమోదు చేయాలని సూచించింది. కరోనాపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు వైరస్‌ బారిన పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News