Kumaram Bheem Asifabad District: ఇంట్లోకి చొరబడి బంగారాన్ని ఎత్తుకెళ్లిన కోతులు

Monkeys theft 30 gram gold chins in Telangana
  • కుమురంభీం జిల్లాలోని రెబ్బెనలో ఘటన
  • వంటింటి నుంచి ఎత్తుకెళ్లిన పప్పు డబ్బాలు
  • వాటిలో మూడు తులాల బంగారు ఆభరణాలు
ఓ ఇంట్లోకి చొరబడిన వానరమూక బంగారాన్ని ఎత్తుకెళ్లడంతో ఆ కుటుంబం లబోదిబోమంటోంది. కుమురంభీం జిల్లాలోని రెబ్బెనలో జరిగిందీ ఘటన. స్థానికులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఇంట్లోకి నిన్న మధ్యాహ్నం కోతుల గుంపు చొరబడింది. నేరుగా వంటింట్లోకి వెళ్లి ఆహారం కోసం వెతికాయి.

ఈ క్రమంలో కనిపించిన పప్పు డబ్బాలతో ఉడాయించాయి. అయితే, కోతులు ఎత్తుకెళ్లిన డబ్బాల్లోని ఒకదాంట్లో ఉద్యోగి తల్లికి చెందిన రెండు తులాలు, కుమార్తెకు చెందిన తులం బంగారు గొలుసు ఉండడంతో వారి గుండెలు అదిరిపోయాయి. స్థానికుల సాయంతో వాటిని వెంబడించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని కుటుంబ సభ్యులు ఘొల్లుమన్నారు.
Kumaram Bheem Asifabad District
Gold
Monkey
Telangana

More Telugu News