Budda Venkanna: రూ.250 ఇచ్చేందుకు రూ.8 వేల జీతంతో మీ కార్యకర్తలను నియమించి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు: బుద్ధా వెంకన్న

Buddha Venknna take a dig at Vijayasai Reddy
  • వలంటీర్లు అంటే ఉచితంగా సేవ చేయాలన్న బుద్ధా
  • పెన్షన్ రూ.3 వేలు అని మోసం చేశారని ఆరోపణ
  • ఇంత చెత్త సీఎం ప్రపంచంలో ఎక్కడా దొరకడని ఎద్దేవా
గ్రామ వలంటీర్లు అందరూ వైసీపీ కార్యకర్తలేనని సభాముఖంగా ప్రకటించారంటూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ధ్వజమెత్తారు. వలంటీర్లు అంటే ఉచితంగా సామాజిక సేవ చేయాలని వ్యాఖ్యానించారు. పెన్షన్ రూ.3 వేలు అని మోసం చేశారని, పెంచింది రూ.250 మాత్రమేనని మండిపడ్డారు. రూ.250 ఇచ్చేందుకు రూ.8 వేల జీతంతో మీ కార్యకర్తలను నియమించి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని విమర్శించారు. తుగ్లక్ తో సరితూగే ఇంత చెత్త సీఎం దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా దొరకడు అని ఎద్దేవా చేశారు.
Budda Venkanna
Vijay Sai Reddy
Volunteer
Jagan
YSRCP

More Telugu News