youtube: తనపై జరుగుతోన్న ప్రచారం పట్ల 'కార్తీక దీపం' సీరియల్‌ హీరోయిన్‌ ఆగ్రహం!

Karthika Deepam serial fame Vantalakka reacts on fake news on her

  • ప్రేమి విశ్వనాథ్ ఇకపై నటించదని వార్తలు
  • మండిపడుతూ వార్నింగ్‌ ఇచ్చిన నటి
  • ఎందుకిలా చేస్తున్నారు? అంటూ ఫైర్

కార్తీక దీపం సీరియల్‌లో ఇకపై తాను నటించబోనంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆ సీరియల్ ఫేమ్ ప్రేమి విశ్వనాథ్ మండిపడింది. తమ గురించి ఫేక్‌ న్యూస్‌ ఎందుకు ప్రచారం చేస్తున్నారో తనకు తెలియదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫేస్‌బుక్‌లో ఫాలోవర్లతో లైవ్‌లో మాట్లాడింది.

 కార్తీక దీపం సీరియల్‌ ను తాను వదిలేసి వెళ్లిపోతున్నానంటూ వస్తోన్న వార్తలపై ఆమె ఈ సందర్భంగా మాట్లాడింది. తమ గురించి ఫేక్ ‌న్యూస్‌ ప్రచారం చేసిన సదరు యూట్యూబ్‌ చానెల్‌పై చర్యలు తీసుకోవడానికి తమ సీరియల్‌ బృందం ప్రయత్నిస్తోందని చెప్పింది.  

'నాకొక కాల్‌ వచ్చింది. ఆ కాల్ ద్వారా నాపై కొన్ని వార్తలొస్తున్నాయని తెలిసింది. ఇది ఫేక్ న్యూస్‌ అని చెప్పడానికే మీముందుకొచ్చాను.. ఇలాంటి న్యూస్ ఎక్కడి నుంచి ప్రచారం చేస్తారో నాకు తెలియదు. ఎందుకిలా చేస్తున్నారు? ఏ యూట్యూబ్ చానల్ ఇలా ఫేక్‌ న్యూస్‌ అప్‌లోడ్‌ చేసిందో నాకు తెలియాలి' అని ఫైర్ అయింది.

'తెలుగులో ఇది నంబర్ 1 సీరియల్. ఇలాంటి న్యూస్‌ ప్రచారం చేస్తే ఏం వస్తుంది? నా ఫ్యాన్స్‌ చాలా బాధపడుతున్నారు. చాలా మంది నాకు మెసేజ్‌ చేసి చెబుతున్నారు. కొందరు ఎందుకిలా అసత్య ప్రచారం చేస్తున్నారో నాకసలు అర్థం కావట్లేదు' అని మండిపడింది. తన గురించి ప్రచారం అవుతోన్న న్యూస్‌ అంతా ఫేక్‌ అని ఆమె స్పష్టం చేసింది.

ప్రస్తుతం తాను కేరళలో ఉన్నానని, సీరియల్‌ షూటింగ్‌లోనే పాల్గొంటున్నానని ప్రేమి విశ్వనాథ్ తెలిపింది. ఇటువంటి న్యూస్‌ నమ్మకూడదని తన అభిమానులను కోరింది.


  • Error fetching data: Network response was not ok

More Telugu News