Veeru. K: 'ఆరోప్రాణం'లో వినీత్ పాత్రను అబ్బాస్ చేయవలసిందట

Aaro Pranam Movie

  • మా సొంత ఊరు కాకినాడ
  • చెన్నైలో చాలా కష్టాలు పడ్డాను 
  • 'ఆరో ప్రాణం' మంచి పేరు తెచ్చిందన్న వీరూ  

తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో 30 లోపు సినిమాలను దర్శకుడు వీరూ.కె తెరకెక్కించారు. తెలుగులో ఆయన 12 సినిమాలను రూపొందించగా, వాటిలో 'ఆరో ప్రాణం' మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమాను గురించి తాజా ఇంటర్వ్యూలో ఆయన ప్రస్తావించారు.

" కాకినాడ నుంచి నేరుగా చెన్నై వెళ్లిన నేను, అందరి మాదిరిగానే సినిమా కష్టాలను అనుభవించాను. ఆ తరువాత అంచలంచెలుగా ఎదుగుతూ దర్శకుడిగా మారాను. 'ఆరో ప్రాణం' సినిమాలో హీరో ఎవరైతే బాగుంటారా అని మేమంతా ఆలోచిస్తుండగా, 'ప్రేమదేశం' సినిమా ద్వారా ఇద్దరు కొత్త కుర్రాళ్లు పరిచయమైనట్టు తెలిసి అక్కడికి వెళ్లాము. లొకేషన్లో చాలామంది అమ్మాయిలు వున్నారు. ఆటోగ్రాఫ్ లంటూ అబ్బాస్ పై ఎగబడుతున్నారు. దాంతో ఆయనను కలుసుకోవడానికే మాకు చాలా సమయం పట్టేసింది. ఇక ఆయనకి కథ వినిపించడం కూడా కష్టమేననిపించి వినీత్ ను తీసుకున్నాము. ఆయన మంచి ఆర్టిస్టు .. ఇక సౌందర్య ఈ సినిమాకి ఆరో ప్రాణంగా నిలిచిందని చెప్పొచ్చు" అన్నారు.

  • Loading...

More Telugu News