Anagani Satya Prasad: సీఎం జగన్ కు టీడీపీ ఎమ్మెల్యే అనగాని బహిరంగ లేఖ

TDP MLA Anagani writes CM Jagan over sand mafia
  • ఇసుక మాఫియాపై ఫిర్యాదు
  • ఇసుక మాఫియాలో భారీ సంఖ్యలో ప్రజాప్రతినిధులు ఉన్నారని వెల్లడి
  • సీఎంకు వారి దోపిడీ కనిపించడం లేదా? అంటూ లేఖాస్త్రం
రాష్ట్రంలో ఇసుక మాఫియా స్వైరవిహారం చేస్తోందంటూ టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. నలుగురు ఎంపీలు, 10 మంది మంత్రులు, 67 మంది ఎమ్మెల్యేలు ఈ ఇసుక మాఫియాలో ఉన్నారని, వారు చేస్తున్న దోపిడీ ముఖ్యమంత్రికి కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. నదులు, వాగులతో పాటు ఆఖరికి చెరువులను కూడా తవ్వేస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు అనగాని సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. గతంలో ఇసుక ట్రాక్టర్ రూ.1500 ధర పలికితే ఇప్పుడది రూ.5 వేలకి చేరిందని, లారీ ఇసుక గతంలో రూ.10 వేలు ఉంటే ఇప్పుడది రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు పలుకుతోందని ఆరోపించారు. టోల్ ఫ్రీ నెంబర్ 14500కి ఫోన్ చేసినా స్పందన కరవైందని ఆవేదన వ్యక్తం చేశారు.
Anagani Satya Prasad
Jagan
Letter
Sand Mafia
Andhra Pradesh

More Telugu News