anand mahindra: సూపర్‌ మ్యాన్‌ రేంజ్‌లో గాల్లోకి ఎగిరి జడేజా పట్టిన అద్భుత క్యాచ్‌కు ఆశ్చర్యపోయిన ఆనంద్‌ మహీంద్ర

This catch from Indias Ravi Jadeja is indescribable anand mahindra

  • కివీస్‌తో రెండో టెస్టులో జడేజా అద్భుత క్యాచ్
  • వాగ్నర్‌ స్వ్కెర్‌ లెగ్‌లో భారీ షాట్‌
  • క్యాచ్‌ పట్టి ఔట్ చేసిన జడేజా
  • ఆ క్యాచ్‌పై ప్రశంసల జల్లు

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఆటగాడు రవీంద్ర జడేజా అద్భుత క్యాచ్‌ పట్టాడు. సూపర్‌ మ్యాన్‌ రేంజ్‌లో ఆయన ఎగిరి పట్టిన ఆ క్యాచ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. షమీ వేసిన బంతిని కివీస్‌ బ్యాట్స్‌మన్‌ వాగ్నర్‌ స్వ్కెర్‌ లెగ్‌లో భారీ షాట్‌ బాదాడు.

అది అలాగే వెళ్లి బౌండరీ దాటుతుందని అందరూ భావించారు. అయితే,  ఫీల్డింగ్‌ చేస్తున్న జడేజా ఎవరి అంచనాలకు అందని విధంగా గాల్లోకి ఎగిరి క్యాచ్‌ అందుకుని ఔరా అనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్ చేస్తూ ప్రశంసల జల్లు కురిపించారు.

ఆదివారం ఉదయం కనపడిన అద్భుతమైన దృశ్యమని ఆయన పేర్కొన్నారు. మనకు అందకుండా బంతి వెళ్లిపోతుందనుకున్నామని ఆయన అన్నారు. కానీ, సాధ్యమైనంత మేరకు ప్రయత్నిస్తే మనం దాన్ని పట్టేయవచ్చని తెలిపారు. అలాగే, సాధ్యమైనంత మేరకు ప్రయత్నిస్తే మళ్లీ ఆటలో కూడా రాణించవచ్చని సందేశమిచ్చారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News