Corono: ఆస్ట్రేలియాలో కరోనా కలకలం : తొలి మరణం నమోదు
- మృతుడు జపాన్ నౌక్ డైమండ్ ప్రిన్సెస్‌లో బాధితుడు
- నౌక నుంచి తెచ్చి పెర్త్‌లో వైద్య సేవలు
- వైద్య సేవలు పొందుతున్న మరో 120 మంది బాధితులు
చైనాను కుదిపేసిన కరోనా (కోవిడ్-19) కల్లోలం ఇతర దేశాలను భయపెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 57 దేశాలకు వ్యాధి విస్తరించగా ఆస్ట్రేలియాలో తొలి మరణం నమోదు కావడంతో ఆ దేశ యంత్రాంగం హడలి పోతోంది. జపాన్‌కు చెందిన ప్రయాణికుల నౌక డైమండ్ ప్రిన్సెస్‌లో చిక్కుకుని కరోనా వైరస్ బారిన పడిన 121 మంది అస్ట్రేలియన్లను ఇటీవల ఆ దేశం తీసుకు వెళ్లింది. పెర్త్‌లోని ఓ ప్రత్యేక ఆసుపత్రిలో వారికి వైద్య సేవలు అందిస్తోంది. వీరిలో ఒకరు చనిపోగా మరో 120 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. కరోనా బారిన పడి చైనాలో ఇప్పటి వరకు 2,870 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యాధి ఇరాన్, దక్షిణ కొరియా దేశాలను వణికిస్తోంది. ఈ దేశాల్లోనూ వందలాది మంది బాధితులు ఉండడం గమనార్హం.