Baby Girl: గుజరాత్ లో ఘోరం... మూడు రోజుల పసికందుపై 20 కత్తిపోట్లు!

Baby Girl Stabbed 20 Times

  • బహిరంగ ప్రదేశంలో రోజుల బాలిక
  • కుక్క ఈడ్చుకుని వెళుతుంటే చూసిన యువకులు
  • ఆసుపత్రిలో కోలుకుంటున్న పసికందు

గుజరాత్ లోని రాజ్ కోట్ జిల్లాలో ఘోరం జరిగింది. మహీక్ - తేబాచాడా గ్రామాల మధ్య బహిరంగ ప్రదేశంలో మూడు రోజుల వయసున్న పసికందు శరీరంపై 20 కత్తిపోట్లు కనిపించాయి. బాలికను ఓ శునకం నోట కరచుకుని వెళుతుండగా, క్రికెట్ ఆడేందుకు ఆ ప్రాంతానికి వచ్చిన కొందరు యువకులు చూసి, పసికందును కాపాడి, ఆసుపత్రికి తరలించారు.

పాప శరీరంపై 20 వరకూ కత్తిపోట్లు ఉన్నాయని, నోటిలో మట్టి పోసి, ఆ ప్రాంతంలో వదిలి వెళ్లారని వైద్యులు గుర్తించారు. నోటిలో మట్టి దూరడంతో ఊపిరి తీసుకోవడం కష్టం కాగా, మట్టిని తొలగించామని, పాపకు వైద్యం కొనసాగుతోందని, ఆరోగ్యం స్థిరంగానే ఉందని అన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి, దర్యాఫ్తు ప్రారంభించారు. ఆడపిల్ల పుట్టిందన్న కారణంతోనే ఎవరో ఇలా చేసి వుండవచ్చని అంచనా వేశారు.

Baby Girl
Gujarath
Stabbing
Dog
  • Loading...

More Telugu News