Prabhas: సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలోనే ప్రభాస్ తో నాగ్ అశ్విన్ మూవీ

Nag Ashwin Movie

  • ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ మూవీ 
  •  సూపర్ హీరోగా కనిపించనున్న ప్రభాస్ 
  •  త్వరలోనే పూర్తి వివరాలు  

'మహానటి' సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న నాగ్ అశ్విన్, తన తదుపరి సినిమాను ప్రభాస్ తో ప్లాన్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఆయన నిన్న ప్రకటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ప్రకటించిన దగ్గర నుంచి, ఇది ఏ జోనర్లో రూపొందనుంది? ఇందులో ప్రభాస్ ఎలా కనిపించనున్నాడు? ఆయన పాత్ర తీరు తెన్నులు ఎలా ఉంటాయి? అనే ఆసక్తి అందరిలో రేకెత్తుతోంది.

ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో కొనసాగనుందని తెలుస్తోంది. ప్రభాస్ సూపర్ హీరోలా కనిపిస్తాడట. సూపర్ నేచురల్ పవర్స్ వుండే హీరోలా ఆయన పాత్ర ఉంటుందని అంటున్నారు. ఆయన లుక్ .. బాడీ లాంగ్వేజ్ 'క్రిష్' చిత్రంలో హృతిక్ రోషన్ ను గుర్తుకు తెచ్చేలా ఉంటుందని చెబుతున్నారు. బలమైన కథాకథనాలతో పాటు .. అందుకు తగిన యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయికలు ఎవరు? ప్రతినాయకుడు ఎవరు? వంటి విషయాలు త్వరలోనే తెలియనున్నాయి. ప్రభాస్ అభిమానులంతా ఈ సినిమా విశేషాల పట్ల ఎంతో ఆత్రుతతో వున్నారు.

Prabhas
Nag Ashwin Movie
Tollywood
  • Loading...

More Telugu News