Hyderabad: అనుమానంతో భార్యకు చిత్రహింసలు.. వాతలు పెట్టి కొడుకుతో వీడియో తీయించిన భర్త!

Husband assaults wife In Vanaparthi Telangana
  • భార్యను వివస్త్రను చేసి ఇనుపకడ్డీతో వాతలు
  • 14 ఏళ్ల కొడుకుతో ఈ దృశ్యాల చిత్రీకరణ
  • భయానకంగా ఉన్నాయన్న పోలీసులు
భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త.. ఆమెను చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా ఆ దృశ్యాలను కుమారుడితో వీడియో తీయించాడు. తెలంగాణలోని వనపర్తి పోలీసుల కథనం ప్రకారం.. జిల్లా కేంద్రానికి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన భార్యాభర్తలు హైదరాబాద్ వచ్చి జీవిస్తున్నారు. ఇటీవల భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. రెండు రోజుల క్రితం ఇదే విషయమై వారి మధ్య వాగ్వివాదం జరిగింది.

 దీంతో రెచ్చిపోయిన భర్త.. భార్యను వివస్త్రను చేసి ఇనుపకడ్డీతో వాతలు పెట్టాడు. అక్కడితో ఆగక ఈ దారుణాన్ని 14 ఏళ్ల తన కొడుకుతో వీడియో తీయించాడు. అతడి బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు వనపర్తి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసును రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కు బదలాయించారు. బాధితురాలిని భర్త చిత్రహింసలకు గురిచేసిన దృశ్యాలు భయానకంగా ఉన్నాయని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు.
Hyderabad
Vanaparthi
Crime News

More Telugu News