Balakrishna: కవల సోదరులుగా బాలకృష్ణ ద్విపాత్రాభినయం

Boyapati Movie

  • నవగ్రహాల నేపథ్యంలో సాగే కథ 
  •  అఘోరగా కనిపించనున్న బాలయ్య 
  • ప్రతినాయకుడి పాత్రలో జగపతిబాబు

బాలకృష్ణ .. బోయపాటి కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతోంది. కథాకథనాల్లో కొత్తదనం చూపించడం కోసం, ఈ సారి బోయపాటి కాస్త ఎక్కువ సమయాన్నే తీసుకున్నాడు. నవగ్రహాలు .. మానవ జీవితాలను అవి ఎలా ప్రభావితం చేస్తాయి? అనే అంశాలను గురించిన ప్రస్తావన ఈ కథలో చోటుచేసుకుందని సమాచారం.

ఈ సినిమాలో బాలకృష్ణ 'అఘోర'గా కనిపించనున్నాడనే టాక్ అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. అసలు ఆయన పాత్ర తీరు తెన్నులేమిటి? అఘోరగా ఆయన ఎంతసేపు కనిపిస్తాడు? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో బాలకృష్ణ కవల సోదరులుగా కనిస్తాడనేది తాజా సమాచారం. ఒక తల్లి కడుపున జన్మించిన కవలలు ఇద్దరూ, కొన్ని కారణాల వలన విడిపోతారట. అలా ఒకరు రాయలసీమ ప్రాంతంలో పెరిగితే, మరొకరు కాశీలో అఘోరగా మారతాడట. అఘోర పాత్ర 'విరామం' తరువాత ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు. కథానాయికలుగా శ్రియ - అంజలి కనిపించనున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో, ప్రతినాయకుడి పాత్రను జగపతిబాబు పోషిస్తున్నారు.

Balakrishna
Shriya
Anjali
Boyapati Movie
  • Loading...

More Telugu News