Hyper Aadi: 'జబర్దస్త్' ఎంతోమందికి లైఫ్ ఇచ్చింది: హైపర్ ఆది

jabardasth Comedy Show

  • శ్యామ్ ప్రసాద్ రెడ్డిగారు ప్రోత్సహించారు 
  • 'జబర్దస్త్' ఎన్నో అవకాశాలను తెచ్చిపెట్టింది 
  • కష్టానికి తగిన ప్రతిఫలం ముడుతూనే ఉందన్న హైపర్ ఆది

'జబర్దస్త్' కామెడీ షో ద్వారా చాలామంది కమెడియన్స్ పాప్యులర్ అయ్యారు. ఆ జాబితాలో ముందు వరుసలో కనిపించే పేరు 'హైపర్ ఆది'. 'జబర్దస్త్' వేదికపై హైపర్ ఆది స్కిట్లకు .. ఆయన పంచ్ లకు చాలామందే అభిమానులు వున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. 'జబర్దస్త్' వల్లనే మా అందరికీ మంచిపేరు వచ్చింది. శ్యామ్ ప్రసాద్ రెడ్డిగారు మాలోని టాలెంట్ ను గుర్తించారు .. ఇంకా బాగా చేయమంటూ ప్రోత్సహించారు.

'జబర్దస్త్' మా అందరికీ లైఫ్ ఇచ్చింది. ఆ కార్యక్రమం వల్లనే మేము బయట స్కిట్లు చేసుకుంటున్నాము. ఆ క్రేజ్ వల్లనే సినిమాల్లోను అవకాశాలను సంపాదించుకుంటున్నాము. ఇలా 'జబర్దస్త్' మాకు ఎన్నో అవకాశాలను తెచ్చిపెడుతుండటం వలన, మేము ఎప్పుడూ పారితోషికం గురించి మాట్లాడేవాళ్లం కాదు. అలా అని చెప్పేసి పారితోషికం విషయంలో మాకు ఎలాంటి అసంతృప్తి ఉండేది కాదు. మా కష్టానికి తగిన ప్రతిఫలం ముడుతూనే వుంది" అని చెప్పుకొచ్చాడు.

Hyper Aadi
Shyam Prasad Reddy
Jabardasth
  • Loading...

More Telugu News