Budda Venkanna: 9 నెలల్లోనే 20 వేల కోట్లు కొట్టేసే స్కెచ్ వేశారు: జగన్‌పై బుద్ధా వెంకన్న ఆగ్రహం

budda venkanna criticises vijay sai reddy and jagan

  • ఏపీ సీఎం జగన్‌ను చూసి అవినీతే తలదించుకుంటుంది
  • రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజలకు టెండర్ పెట్టారు
  • సూట్ కేస్ కంపెనీలకు పనులు అప్పజెప్పుతున్నారు
  • రివర్స్ టెండరింగ్ వెనుక ఉన్న లాజిక్ ప్రజలకు అర్థం అయ్యింది 

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్ర ఆరోపణలు గుప్పించారు. 'ఏపీ సీఎం జగన్‌ను చూసి అవినీతే తలదించుకుంటుంది. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజలకు టెండర్ పెట్టారు. సూట్ కేస్ కంపెనీలకు పనులు అప్పజెప్పి 9 నెలల్లోనే 20 వేల కోట్లు కొట్టేసే స్కెచ్ వేశారు. రివర్స్ టెండరింగ్ వెనుక ఉన్న లాజిక్ ప్రజలకు అర్థం అయ్యింది' అని చెప్పారు.
 
'ముఖ్యమంత్రి కొడుకుగానే 43 వేల కోట్లు కొట్టేసిన జగన్ గారు ఇప్పుడు సీఎంగా దానికి పదింతలు సంపద వెనకెయ్యడానికి పెట్టిన పేరే రివర్స్ టెండరింగ్' అని ఆరోపించారు.  

Budda Venkanna
Telugudesam
Jagan
YSRCP
  • Loading...

More Telugu News