Nara Lokesh: ప్రజల నోట్లో మట్టి కొట్టారు.. తుగ్లక్ పాలనపై గుక్క తిప్పుకోకుండా ఈ మహిళ చెప్పింది: వీడియో పోస్ట్ చేసిన లోకేశ్
- అన్న క్యాంటిన్ ఎత్తేశారు
- ప్రజల నోట్లో మట్టి కొట్టారు
- ఒక్క అవకాశం ఇస్తే నట్టేట ముంచారు
- జగన్‌పై లోకేశ్ ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. 'అన్న క్యాంటిన్ ఎత్తేశారు. ప్రజల నోట్లో మట్టి కొట్టారు. ఒక్క అవకాశం ఇస్తే నట్టేట ముంచారు. 9 నెలల తుగ్లక్ పాలన పై గుక్క తిప్పుకోకుండా..' అంటూ లోకేశ్ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఓ మహిళ తన ఆవేదనను చెప్పుకుంది. పేదలంతా అన్నమో రామచంద్రా అంటున్నారని ఆ మహిళ తెలిపింది. చంద్రబాబు పాలనలో అన్న క్యాంటీన్ల ద్వారా రూ.5కే ఆహారం అందిందని చెప్పింది.
'తెలుగు యువత వర్క్ షాప్ లో పాల్గొన్నాను. టీడీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఉత్తమ రాష్ట్రాలతో పోటీ పడింది. ఇప్పుడు తుగ్లక్ గారి పాలనలో ఆంధ్రప్రదేశ్... బీహార్ తో పోటీ పడే పరిస్థితికి వచ్చేసింది. వచ్చే కంపెనీలను వద్దు పొమ్మంటున్నారు, ఉన్న కంపెనీలను తరిమేస్తున్నారు' అని తెలిపారు.
'నిరుద్యోగులకు అండగా నిలిచిన నిరుద్యోగ భృతి కార్యక్రమాన్ని ఎత్తేసి యువత వ్యతిరేకిగా జగన్ గారు నిలిచారు. రాష్ట్ర యువతకి తీరని నష్టం చేస్తున్న వైకాపా ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ యువతకి అండగా పోరాటానికి సిద్ధం అవ్వాలని తెలుగు యువత నాయకులకు దిశానిర్దేశం చేశాను' అని ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఫొటోలను ఆయన పోస్ట్ చేశారు.