Vishwanth: 'ఓ పిట్టకథ' నుంచి యూత్ ఫుల్ సాంగ్

Youthful song released from O Pitta Katha Movie

  • మరో ప్రేమకథా చిత్రంగా 'ఓ పిట్టకథ'
  • దర్శకుడిగా చెందు ముద్దు 
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు

తెలుగు ప్రేక్షగాకులను పలకరించడానికి మరో ప్రేమకథా చిత్రం రూపొందుతోంది .. ఆ సినిమా పేరే ' ఓ పిట్ట కథ'. విశ్వంత్ - నిత్యా శెట్టి నాయకా నాయికలుగా ఈ సినిమా నిర్మితమైంది. ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ద్వారా చెందు ముద్దు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియోను విడుదల చేశారు.

"ఏదో ఏదో ఏదో ఏదో ఏదో ఏదో ఏదో .. నన్ను తాకినట్టు వుంది మాయే ఏదో ఏదో ఏదో. అందమైన మాటకు అర్థమేదో ..ఊహతో రెచ్చగొట్టు భావమేదో" అంటూ ఈ పాట సాగుతోంది. తొలిసారి ప్రేమలోపడిన ఒక యువకుడు, తన ప్రియురాలితో కలిసి గడిపే ఆనందకరమైన క్షణాలను ఊహించుకుంటూ పాడే ఈ పాట యూత్ కి కనెక్ట్ అయ్యేలా వుంది. ప్రవీణ్ లక్కరాజు సంగీతం .. శ్రీజో సాహిత్యం .. స్వీకర్ అగస్తి ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి. మార్చి 6వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ప్రేమకథ చిత్రం యూత్ ను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి మరి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News