P.N. Ramachandra Rao: నువ్వు పొట్టిగా వున్నావ్ .. యాక్టర్ ఎలా అవుతావ్ అన్నాడాయన: దర్శకుడు పీఎన్ రామచంద్రరావు

Kottha Kapuram Movie

  • మొదటి నుంచి సినిమాల పిచ్చి ఎక్కువ 
  •  యాక్టర్ కావాలనే కోరిక బలంగా ఉండేది 
  •  డూండీ అలా అన్నారన్న పీఎన్ రామచంద్రరావు  

దర్శకుడిగా .. నిర్మాతగా పీఎన్ రామచంద్రరావుకి మంచి గుర్తింపు వుంది. కుటుంబ కథాచిత్రాలను .. హాస్యరసభరిత చిత్రాలను ఆయన తెరకెక్కించారు. అలా ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలలో 'చిత్రం భళారే విచిత్రం' ..'గాంధీ నగర్ రెండో వీధి' చెప్పుకోదగినవిగా కనిపిస్తాయి.

తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "మాది నెల్లూరు జిల్లాలోని 'పాలపల్లి' గ్రామం. చిన్నప్పటి నుంచి కూడా నాకు సినిమాలపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. యాక్టర్ కావాలనే కోరిక బలంగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లోనే చెన్నై ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో చేరమంటూ ఒక ప్రకటన వచ్చింది. అప్పటికి నా వయసు 18 ఏళ్లే. అప్లై చేసిన వారిలో 21 ఏళ్లు ఉన్నవారికి అక్కడి నుంచి కబురు వచ్చింది.

నాకు కబురు రాకపోయినా నేను చెన్నై వెళ్లాను. లోపలికి  రానీయకపోవడంతో, అక్కడ కూర్చుని ఏడుస్తున్నాను. అప్పుడు అటుగా వెళుతూ దర్శక నిర్మాత 'డూండీ' గారు నన్ను చూశారు. నా గురించి అడిగి తెలుసుకున్నారు. ''నువ్ పొట్టిగా వున్నావ్ .. యాక్టర్ వి ఎలా అవుతావు. ఆర్టిస్టులను మలిచే దర్శకుడిగా మారడానికి ప్రయత్నం చేయి .. ముందు ఏ దర్శకుడి దగ్గరైనా పనిచేయి" అన్నారు. అప్పుడు నేను పీసీ రెడ్డి గారి దగ్గర 'కొత్త కాపురం' సినిమాకి గాను అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యాను" అని చెప్పుకొచ్చారు.

P.N. Ramachandra Rao
Doondi
Kottha Kapuram Movie
  • Loading...

More Telugu News