Nithin: 'రంగ్ దే' పైనే పూర్తి దృష్టిపెట్టిన నితిన్

Rang De Movie

  • 'భీష్మ'తో హిట్ కొట్టిన నితిన్ 
  • తరువాత చిత్రంగా 'రంగ్ దే'
  • 'చెక్' సినిమా లేటయ్యే ఛాన్స్    

ప్రస్తుతం నితిన్ సినిమాలు రెండు సెట్స్ పై వున్నాయి. ఒకటి 'రంగ్ దే' కాగా, మరొకటి 'చెక్'. 'రంగ్ దే' సినిమాకి వెంకీ అట్లూరి దర్శకుడు. పూర్తి ప్రేమకథా చిత్రంగా ఈ సినిమా నిర్మితమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా 30 శాతం చిత్రీకరణ జరుపుకుంది. మిగతా 70 శాతం చిత్రీకరణను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలనే పట్టుదలతో వున్నారు.

ఇక 'చెక్' సినిమాకి చంద్రశేఖర్ యేలేటి దర్శకుడు. భవ్య సంస్థవారు నిర్మించే ఈ సినిమా, థ్రిల్లర్ నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాలో నితిన్ చాలావరకూ ఖైదీ డ్రెస్ తోనే కనిపిస్తాడట. అయితే ఈ బ్యానర్ వారు ముందుగా తమ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్నారట. ఆ దిశగా నితిన్ ను ఒప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. అయితే నితిన్ మాత్రం 'భీష్మ' హిట్ తరువాత, 'రంగ్ దే'వంటి ప్రేమకథా చిత్రం రావడమే మంచిదనే అభిప్రాయంతో వున్నాడని అంటున్నారు. అందువలన 'భీష్మ' తరువాత నితిన్ నుంచి 'రంగ్ దే' రావడమే ఖాయమని తెలుస్తోంది.

Nithin
Venky Atluri
Chandra sekhar Yeleti
Rang De Movie
  • Loading...

More Telugu News