Donald Trump: గాంధీ నడయాడిన చోట... ట్రంప్ కు శాకాహార అల్పాహారం... మెనూ ఇదిగో!

Vegetarian Tiffin for Trump

  • సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించనున్న ట్రంప్
  • కనీసం 20 నిమిషాలు గడిపే అవకాశం
  • పండ్ల రసాలు, సమోసాలు, ఆపిల్ పై సిద్ధం

మరికాసేపట్లో అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్, భారత పర్యటన ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ లోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యే ట్రంప్, అక్కడి నుంచి నరేంద్ర మోదీతో కలిసి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొతేరా స్టేడియానికి చేరుకుంటారన్న సంగతి తెలిసిందే. మార్గ మధ్యంలో మహాత్మాగాంధీ నడయాడిన సబర్మతీ ఆశ్రమాన్ని ఆయన సందర్శిస్తారు. ఈ సందర్భంగా ట్రంప్, అక్కడే అల్పాహారాన్ని స్వీకరించనున్నారు.

అది గాంధీ ఆశ్రమం కాబట్టి, పూర్తి శాకాహార వంటకాలనే ట్రంప్ కు వడ్డించనున్నారు. ఇక మెనూలో ఫేమస్ గుజరాతీ వంటకాలైన కాజూ కట్లీ, కార్న్ సమోసా, బ్రకోలీ సమోసా, ఖమన్, ఆపిల్ పై తదితరాలను ట్రంప్, మెలానియా స్వీకరిస్తారని, వీరికోసం పలురకాల పండ్ల రసాలను సిద్ధం చేశామని సబర్మతీ ఆశ్రమ నిర్వాహకులు వెల్లడించారు.

కాగా, కేవలం 15 నుంచి 20 నిమిషాలు మాత్రమే ట్రంప్ సబర్మతీ ఆశ్రమంలో గడుపుతారు. గాంధీ వాడిన పలు వస్తువులను ఆయన సందర్శించనున్నారు. ఆయన గదిని, అక్కడి నుంచి నర్మదా నదిని తిలకించనున్నారు.

Donald Trump
Ahmadabad
Vegeterian
Tiffin
Narendra Modi
  • Loading...

More Telugu News