Vijay Sai Reddy: అచ్చెన్న దోచుకున్న ప్రతి రూపాయిలో సగం లోకేశ్ కు పంపించాడు: విజయసాయిరెడ్డి

Vijaysai Reddy take a dig at Atchannaidu

  • ఈఎస్ఐ అంశంలో అచ్చన్నాయుడిపై విరుచుకుపడుతున్న వైసీపీ నేతలు
  • తండ్రీకొడుకుల కనుసన్నల్లోనే కుంభకోణం జరిగిందన్న విజయసాయి
  • అందుకే అచ్చన్న ధీమాగా ఉన్నాడని ట్వీట్

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చన్నాయుడుపై ఈఎస్ఐ అంశంలో వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా స్పందించారు. అచ్చన్న దోచుకున్న ప్రతి రూపాయిలో లోకేశ్ కు పంపించాడని ఆరోపించారు. అంతేకాకుండా, తనకు పార్టీ అండగా నిలవకపోతే డైరీలన్నీ బయటికి తీస్తానని బెదిరిస్తున్నాడట, లోకేశ్ చెబితేనే లేఖ రాశానని సన్నిహితుల వద్ద వాపోతున్నాడట అంటూ విజయసాయి ట్వీట్ చేశారు. ఈ కుంభకోణం తండ్రీకొడుకుల కనుసన్నల్లోనే జరిగిందని, అందుకే అచ్చన్న ధీమాగా ఉన్నాడని పేర్కొన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News