Police: రోడ్డుకి అడ్డంగా పోలీసుల కారు.. నెటిజన్ ట్వీట్.. జరిమానా విధించిన హైదరబాద్ ట్రాఫిక్ పోలీసులు
- హైదరాబాద్‌లోని సైదాబాద్ టీ జంక్షన్ వద్ద ఘటన
- ట్విట్టర్ ద్వారా నగర పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లిన నెటిజన్
- వెంటనే స్పందించిన మీర్ చౌక్ ట్రాఫిక్ పోలీసులు
చట్టానికి ఎవరూ అతీతులు కాదని ట్రాఫిక్ పోలీసులు నిరూపించారు. ఓ పోలీసు కారును హైదరాబాద్‌లోని సైదాబాద్ టీ జంక్షన్ వద్ద రహదారికి అడ్డంగా పెట్టారు. దీంతో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి దాన్ని గుర్తించి పోలీసులకు ట్వీట్ చేశాడు. రోడ్డుకి అడ్డంగా, నిబంధనలకు విరుద్ధంగా కారు పెట్టారని చెబుతూ ట్విట్టర్ ద్వారా నగర పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి, ఫొటో పోస్ట్ చేశాడు.
దీంతో వెంటనే స్పందించిన మీర్ చౌక్ ట్రాఫిక్ పోలీసులు ఆ పోలీసు కారుకు జరిమానా విధిస్తూ చలానా పంపారు. రహదారికి అడ్డంగా పోలీసులు కారు నిలిపారని, దీంతో నిబంధనల ప్రకారం రూ.135 చెల్లించాలని అందులో పేర్కొన్నారు.