Mahesh Babu: వంశీ పైడిపల్లితో మహేశ్ మూవీ మరింత ఆలస్యం?

Vamshi Paidipally Movie

  • 'మహర్షి'తో హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లి 
  • మరో అవకాశం ఇచ్చిన మహేశ్ బాబు 
  • కథ విషయంలోపూర్తి కాని కసరత్తు

మహేశ్ బాబు తన తాజా చిత్రాన్ని వంశీ పైడిపల్లితో చేయవలసి వుంది. ఇంతకుముందు ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'మహర్షి' భారీ విజయాన్ని అందుకుంది. దాంతో వంశీ పైడిపల్లితో మరో సినిమా చేయడానికి మహేశ్ బాబు ఆసక్తిని చూపాడు.  మహేశ్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' పూర్తి చేసేలోగా, వంశీ పైడిపల్లి స్క్రిప్ట్ ను సిద్ధం చేశాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లవలసి వుంది.

అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన హడావిడి ఎక్కడా కనిపించడం లేదు. అందుకు కారణం ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ఆలస్యం కానుందనేది తాజా సమాచారం. వంశీ పైడిపల్లి సిద్ధం చేసిన స్క్రిప్ట్ లో మహేశ్ బాబు మార్పులు .. చేర్పులు చెప్పాడట. వాటిపై కసరత్తును చేసి, పెర్ఫెక్ట్ గా సిద్ధం చేయడానికి వంశీ పైడిపల్లికి చాలా సమయమే పడుతుందని అంటున్నారు. అందువలన ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి చాలా సమయమే పడుతుందట. మరి మహేశ్ అప్పటివరకూ వేచి చూస్తాడా? లేదంటే వేరే దర్శకుడిని లైన్లో పెడతాడా? అనేది చూడాలి.

Mahesh Babu
Vamshi Paidipally
Tollywood
  • Loading...

More Telugu News