Jayaram: చంద్రబాబు ప్రభుత్వం కార్మికులను కూడా దోచుకుంది: ఏపీ మంత్రి జయరాం

  • గత ప్రభుత్వ హయాంలో ఈఎస్ఐలో భారీ అవినీతి జరిగింది
  • ఈఎస్ఐ అక్రమాలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించాం
  • అవినీతికి పాల్పడిన వారిని వదిలిపెట్టం

ఏపీలో గత ప్రభుత్వ హయాంలో ఈఎస్ఐలో భారీ అవినీతి జరిగిందని, చంద్రబాబు ప్రభుత్వం చివరకు కార్మికులను కూడా దోచుకుందని మంత్రి జయరాం ఎద్దేవా చేశారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈఎస్ఐ అక్రమాలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించామని చెప్పారు. అచ్చెన్నాయుడు అవినీతికి ఆయన రాసిన లేఖే నిదర్శనమని, అవినీతికి పాల్పడిన వారిని వదిలిపెట్టమని హెచ్చరించారు. అవినీతిపై విజిలెన్స్ నివేదిక ఆధారంగా చర్యలు చేపడతామని అన్నారు.

Jayaram
Minister
Andhra Pradesh
Chandrababu
ESI Scam
  • Loading...

More Telugu News