Kamal Haasan: విచారణకు రండి... శంకర్, కమల్ హాసన్ లకు పోలీసుల నోటీసులు!

Police Summons for Kamal and shanker

  • బుధవారం రాత్రి క్రేన్ ప్రమాదం
  • ఘటనలో మరణించిన ముగ్గురు టెక్నీషియన్లు
  • 25లోపు విచారణకు రావాలని ఆదేశం

బుధవారం నాడు తమిళనాడులో కమలహాసన్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారతీయుడు-2 చిత్రం షూటింగ్ లో జరిగిన పెను ప్రమాదం ముగ్గురు యువ టెక్నీషియన్లను బలి తీసుకోగా, పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై సుమోటోగా కేసు పెట్టిన పోలీసులు, ఐపీసీలోని 4 సెక్షన్లు జోడించారు. విచారణకు రావాలని శంకర్, కమలహాసన్, క్రేన్ ఆపరేటర్ లతో పాటు క్రేన్ యజమాని, ప్రొడక్షన్ మేనేజర్ లకు నోటీసులు పంపించారు. వీరంతా 25వ తేదీలోపు విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు.

  • Loading...

More Telugu News