Sweeden: స్వీడన్ నుంచి వచ్చి తమిళనాట బిచ్చమెత్తుకుంటున్న పారిశ్రామికవేత్త!
- మానసిక ప్రశాంతత కోసం ఇండియాకు వచ్చిన కిమ్
- ప్రశాంతత లభించక వీధుల్లో భిక్షాటన
- కోవై ప్రజల్లో పెద్దఎత్తున చర్చ
అతని పేరు కిమ్. స్వీడన్ లో యువ పారిశ్రామికవేత్త... ఎంతో మందికి ఉపాధినిచ్చే చేతులు. అయితేనేం?... మానసిక ప్రశాంతత కరవైంది. ఇండియాకు వెళితే, ప్రశాంతత లభిస్తుందని ఎవరు చెప్పారో గానీ, ఇండియాకు వచ్చేసి తమిళనాడుకు చేరారు. కోయంబత్తూరులో పేదలకు, బడుగు, బలహీనులకు సాయం చేస్తూ కొంతకాలం గడిపారు. అయినా, అతను కోరుకున్న మానసిక ప్రశాంతత లభించలేదు.
దీంతో సర్వమూ వదిలేసి కోవైలోని ఈషా యోగా కేంద్రంలో కొంత కాలం ఉండి, ఆపై వీధుల్లో భిక్షాటనకు దిగారు. రెండు చేతులెత్తి నమస్కరిస్తూ, పుణ్యాత్ములు దానం చేసే 5, 10 రూపాయలను స్వీకరిస్తూ, కాలక్షేపం చేస్తున్నారు. ఇక అతని కథను తెలుసుకున్న పలువురు విస్మయం చెందుతున్నారు. విదేశాల్లో ధనవంతురాలైన అతను, ఇలా బిచ్చమెత్తడంపై పెద్ద చర్చే జరుగుతోంది.