Mahbubnagar District: కొడుకుపై అమ్మ అలిగింది... ప్రాణం తీసుకుంది!

mother suicide

  • మేడ పై నుంచి దూకి ఆత్మహత్య 
  • పనీపాటలేకుండా తిరుగుతున్నాడని మందలించిన తండ్రి 
  • దీంతో ఇద్దరి మధ్యా వాగ్వాదం

కొడుకు పనీపాటా లేకుండా జులాయిగా తిరుగుతున్నాడని తండ్రి మందలించాడు. దీంతో ఇద్దరి మధ్యా తీవ్ర వాగ్యుద్ధమే జరిగింది. నిత్యం  ఈ వ్యవహారాన్ని కళ్లారాజూస్తున్న తల్లి మనస్తాపానికి లోనైంది. కొడుకు తీరుతో విసిగిపోయి మేడ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన మహబూబ్ నగర్ జిల్లా భూత్ పూర్ మండలం తాటికొండలో చోటు చేసుకుంది.

పోలీసుల కథనం మేరకు... గ్రామంలోని చిత్రపురం కాలనీలో నివాసం ఉంటున్న పేటా పెంటయ్య , మౌనిక (37) దంపతులు. వీరికి ఓ కొడుకు, కూతురు. పెంటయ్య డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొడుకు కూడా ఏదైనా పనిచేస్తే కాస్త చేదోడుగా ఉంటాడనుకునే వాడు. కానీ కొడుకు జులాయిగా తిరుగుతుండడంతో ఆవేదన చెందేవాడు.

'జులాయిగా తిరగడం కంటే ఏదైనా పనిచేసుకోవచ్చుకదా' అంటూ ఎప్పటిలాగే బుధవారం రాత్రి కొడుకుని మందలించాడు. దీంతో తండ్రీ కొడుకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవతో మౌనిక మనస్తాపానికి లోనైంది. తాముంటున్న భవనం ఆరో అంతస్తుకు వెళ్లి అక్కడి నుంచి దూకేసింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు.

Mahbubnagar District
boothpur mandal
suicide
Crime News
  • Loading...

More Telugu News