Vishwak Sen: 'ఫలక్ నుమా దాస్' కోసం ఎంత రిస్క్ చేశానో నాకు మాత్రమే తెలుసు: హీరో విష్వక్సేన్

Falaknuma Das Movie

  • డబ్బులు ఎక్కువై సినిమా తీశాననుకున్నారు 
  • స్నేహితుల దగ్గర అప్పులు చేశాను 
  • నిజంగా అది వాళ్ల మంచితనమన్న విష్వక్సేన్

విష్వక్సేన్ కి మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ వుంది. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'హిట్' చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, గతంలో తను చేసిన 'ఫలక్ నుమా దాస్' గురించి ప్రస్తావించాడు.

నేను 'ఫలక్ నుమా దాస్' చేస్తున్నప్పుడు, డబ్బులు ఎక్కువై సినిమా తీస్తున్నాడని కొంతమంది అనుకున్నారు. కానీ డబ్బుల విషయంలో నేను ఎంత రిస్క్ చేశానో నాకు మాత్రమే తెలుసు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంతవరకూ నేను చేసిన వాటిల్లో అదే పెద్ద రిస్క్. ఆ సినిమా కోసం 30 .. 35 పర్సెంట్ డబ్బు మాత్రమే మా నాన్న దగ్గర తీసుకున్నాను. మిగతా డబ్బంతా నా స్నేహితుల దగ్గర అప్పుగా తీసుకున్నాను. ఆ డబ్బును ఇచ్చిన గడువులోగా తీర్చేయాలి. అది ఎంత పెద్ద టెన్షనో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నన్ను నమ్మి పెద్ద మొత్తాలను అప్పుగా ఇవ్వడమనేది నిజంగా వాళ్ల మంచితనం" అని చెప్పుకొచ్చాడు.

Vishwak Sen
Falaknuma Das Movie
Tollywood
  • Loading...

More Telugu News