Indian-2: భారతీయుడు-2 సెట్స్ పై మరణించినవారికి రూ.కోటి ఆర్థికసాయం ప్రకటించిన కమలహాసన్

Kamal Haasan announces One crore for who died on Indian2 sets

  • భారతీయుడు-2 సెట్స్ పై ప్రమాదం
  • విరిగిపడిన క్రేన్
  • ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఓ లైట్ బాయ్ దుర్మరణం
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన కమలహాసన్

చెన్నై శివార్లలో భారతీయుడు-2 చిత్రం షూటింగ్ లో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. కమలహాసన్, కాజల్ అగర్వాల్ జంటగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారతీయుడు సీక్వెల్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. అయితే పూనమల్లిలో కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తుండగా, భారీ క్రేన్ విరిగిపడడంతో ఒక అసిస్టెంట్ డైరెక్టర్, ఓ లైట్ బాయ్, ప్రొడక్షన్ అసిస్టెంట్ మరణించారు. ఈ ముగ్గురి మృతికి చిత్ర కథానాయకుడు కమలహాసన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు రూ.కోటి ఆర్థిక సాయం ప్రకటించారు.

  • Loading...

More Telugu News