Muthyala Subbaiah: పవన్ లో పట్టుదల అనేది మొదటి నుంచి వుంది: దర్శకుడు ముత్యాల సుబ్బయ్య

Gokulamlo Seetha Movie

  • పవన్ తో 'గోకులంలో సీత' చేశాను 
  • ఎవరినీ ఇబ్బంది పెట్టేవాడు కాదు
  • అప్పట్లో కాస్త బిడియంగా వుండేవాడన్న సుబ్బయ్య 

బలమైన కథాకథనాలతో దర్శకుడు ముత్యాల సుబ్బయ్య ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. ఎంతోమంది హీరోలకి చెప్పుకోదగిన విజయాలను అందించారు. అలాంటి ముత్యాల సుబ్బయ్య తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ గురించి ప్రస్తావించారు.

"పవన్ కల్యాణ్ కి 'గోకులంలో సీత' రెండవ సినిమా. ఆ సినిమాకి నేను దర్శకత్వం వహించాను. తమిళంలో కార్తీక్ చేసిన ఒక సినిమాకి ఇది రీమేక్. కథలో కొన్ని మార్పులు చేసి తెలుగు ప్రేక్షకులకు అందించాము. ఈ సినిమా చేసేటప్పుడే నేను పవన్ ను దగ్గరగా గమనించాను. ఆయనలో ఒక పట్టుదల అనేది వుంది. తన పనిని తను చాలా సిన్సియర్ గా చేస్తూ వెళ్లేవాడు. ఎవరినీ ఇబ్బంది పెట్టేవాడు కాదు .. ఏమీ అనేవాడు కాదు. పుస్తకాలు ఎక్కువగా చదువుతూ ఉండేవాడు. ఆరంభంలో కాస్త బిడియంగా ఉండే ఆయన, ఇప్పుడు ఇలా మారిపోయిన విధానం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది" అని చెప్పుకొచ్చారు.

Muthyala Subbaiah
Pavan kalyan
Gokulamlo Seetha Movie
  • Loading...

More Telugu News