KCR: అధికారం, హోదా వచ్చాక మనిషి మారకూడదు: సీఎం కేసీఆర్

CM KCR Speech towards newly elected members

  • కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులనుద్దేశించి ప్రసంగం
  • లేని గొప్పదనం, ఆడంబరాలు తెచ్చుకోవద్దని హితవు
  • ప్రస్తుతం రాజకీయాలు చాలా సులభం అయ్యాయని వ్యాఖ్యలు

తెలంగాణ పట్టణాలను ఆదర్శంగా మార్చాల్సిన బాధ్యత మేయర్లు, చైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లపై ఉందని సీఎం కేసీఆర్ ఉద్బోధించారు. కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ, మీ కర్తవ్యాన్ని నిర్వహించడంలో మీరు విజయం సాధించాలి అని ఆకాంక్షించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలు చాలా సులభం అయిపోయాయని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు రాజకీయాలంటే కష్టంతో, త్యాగంతో కూడుకున్న విధి అని తెలిపారు. ప్రజానాయకులుగా ఎదిగితే అది జీవితానికి సాఫల్యం అని అన్నారు.

అధికారం, హోదా వచ్చాక మనిషి మారకూడదని, లేని గొప్పదనాన్ని, ఆడంబరాన్ని తెచ్చుకోవద్దని హితవు పలికారు. ఐదు కోట్ల మందిలో 140 మందికే మేయర్లు, చైర్ పర్సన్లు అయ్యే అవకాశం వచ్చిందని, దీన్ని ఒక సోపానంగా భావించి సానుకూలంగా భావించగలిగితే ప్రజాజీవితంలో ఎంత ముందుకైనా పోవచ్చని, అది మీ చేతుల్లోనే ఉందని తెలిపారు. ప్రజా జీవితం అనుకున్నంత సులభం కాదని, తామ చేసేపనిపై స్పష్టత ఉండాలని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News