Rajtarun: నాని సినిమాతో పోటీ పడుతున్న రాజ్ తరుణ్

Orey Bujjiga Movie

  • రాజ్ తరుణ్ హీరోగా 'ఒరేయ్ బుజ్జిగా'
  • ఉగాది రోజున ప్రేక్షకుల ముందుకు 
  • అదే రోజున వస్తున్న నాని సినిమా 'వి'

కొంతకాలంగా రాజ్ తరుణ్ ను వరుస పరాజయాలు వెంటాడుతున్నాయి. చివరిగా వచ్చిన 'ఇద్దరి లోకం ఒకటే' కూడా ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఆయన తాజా చిత్రంగా 'ఒరేయ్ బుజ్జిగా' సిద్ధమవుతోంది. విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించిన ఈ సినిమాను 'ఉగాది' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని మార్చి 25వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఒక పోస్టర్ ను కూడా వదిలారు.

మాళవిక నాయర్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి, అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించాడు. అయితే ఇదే రోజున నాని - సుధీర్ బాబు ప్రధాన పాత్రధారులుగా 'వి' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. అలాంటి ఈ సినిమాకి పోటీగా 'ఒరేయ్ బుజ్జిగాడు' దిగడంపట్ల అంతా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి నానిపై పోటీలో రాజ్ తరుణ్ ఎంతవరకూ నెగ్గుకొస్తాడో చూడాలి.

Rajtarun
Malavika Nair
Orey Bujjiga Movie
Nani
V Movie
  • Loading...

More Telugu News