Sri Lanka: క్రికెట్ ఆడుతుంటే తలకు తగిలిన బంతి... కుప్పకూలిన శ్రీలంక మహిళా పేసర్ కులసురియ!

Sri lanka Women Cricketer Kulasuriya Injured

  • మహిళా టీ-20 సన్నాహకంగా వార్నప్ మ్యాచ్
  • దక్షిణాఫ్రికాతో ఆడిన శ్రీలంక
  • సూపర్ ఓవర్ లో తలకు తగిలిన బంతి

త్వరలో జరగనున్న మహిళా టీ-20 వరల్డ్ కప్ పోటీలకు సన్నాహకంగా జరిగిన వార్నప్ మ్యాచ్ లో క్రికెట్ బాల్ తలకు తగిలి శ్రీలంక పేస్ బౌలర్ అచిని కులసురియ మైదానంలోనే కుప్పకూలింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో ఈ ఘటన జరిగింది. దక్షిణాఫ్రికా 41 పరుగుల తేడాతో విజయం సాధించినా, కాస్తంత ప్రాక్టీస్ ఉంటుందని మరో ఓవర్ ఆడించారు.

ఆ సమయంలో బ్యాట్స్ వుమన్ క్లో ట్రియన్ భారీ షాట్ ఆడగా, లాంగ్ ఆఫ్ లో ఫీల్డింగ్ చేస్తున్న కులసురియ, దాన్ని అందుకోవడానికి ప్రయత్నించి విఫలమైంది. అయితే, బంతి నేరుగా ఆమె తలపై పడటంతో అక్కడికక్కడే మైదానంలో కుప్పకూలింది. క్రీడాకారిణిలు పరుగున వెళ్లి చూడగా, ఆమె స్పృహ తప్పి ఉండటంతో అందరూ కంగారు పడ్డారు.

వెంటనే అంబులెన్స్ లో సమీపంలోని ఆసుపత్రికి ఆమెను తరలించారు. ఆమెకు ప్రమాదం లేదని, కొన్ని రోజులు పర్యవేక్షణలో ఉంచాలని వైద్యులు వెల్లడించారు. ఇక తాను కొట్టిన బంతికి కులసురియకు ఇలా కావడంపై క్లో ట్రియన్ కన్నీరు మున్నీరైంది. ఆమెను లంక క్రికెటర్లు ఓదార్చారు. ఈ ఘటన తరువాత సూపర్ ఓవర్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించి, ఆటను ముగించారు.

Sri Lanka
South Afrika
Kulasuriya
Cricket
Ball
  • Loading...

More Telugu News