Kawakurthi: టీఆర్ఎస్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇంటిపై దాడి... తీవ్ర ఉద్రిక్తత!

Tenssion arise at TRS MLA Jaipal Yadavs House

  • వెల్దండ పీఏసీఎస్ చైర్మన్ పదవిని ఆశించిన సంజీవ్ కుమార్
  • తన వర్గీయులతో కలిసి జైపాల్ ఇంటివద్ద నిరసన
  • అద్దాలు ధ్వంసం చేయడంతో రంగంలోకి పోలీసులు

కల్వకుర్తి ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత జైపాల్ యాదవ్ ఇంటిపై కొందరు పార్టీ స్థానిక నాయకులు దాడికి దిగడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. నిన్న సహకార సంఘాల ఎన్నికలు జరుగగా, వెల్దండ పీఏసీఎస్ చైర్మన్ పదవిని ఆశిస్తున్న 9వ వార్డు డైరెక్టర్ సంజీవ్ కుమార్ యాదవ్, ఆ పదవిని తనకు ఇవ్వాలని కోరగా, అందుకు జైపాల్ నిరాకరించినట్టు తెలుస్తోంది.

దీంతో తన అనుచరులను వెంటేసుకుని జైపాల్ ఇంటికి చేరుకున్న సంజీవ్ కుమార్, నినాదాలు చేస్తూ, ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. ఆపై తన వర్గీయులతో కలిసి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని సంజీవ్ కుమార్ అనుచరులను చెదరగొట్టి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. జైపాల్ ఇంటివద్ద భద్రతను పెంచారు.

Kawakurthi
Jaipal Yadav
Veldanda
PACS
  • Loading...

More Telugu News