EAMCET: తెలంగాణలో మే 4 నుంచి ఎంసెట్... షెడ్యూల్ ఇదిగో!
- ఫిబ్రవరి 19న ఎంసెట్ నోటిఫికేషన్
- ఫిబ్రవరి 21 నుంచి మార్చి 30 వరకు దరఖాస్తులకు గడువు
- ఆపై జరిమానాతో దరఖాస్తు చేసుకునే అవకాశం
- ఏప్రిల్ 20 నుంచి హాల్ టికెట్ల జారీ
ఇంజినీరింగ్, వైద్య విద్య ప్రవేశాల కోసం తెలంగాణలో మే 4 నుంచి ఎంసెట్ నిర్వహించనున్నారు. మే 4,5,7 తేదీల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం, మే 9,11 తేదీల్లో మెడికల్, అగ్రికల్చర్ ప్రవేశాల కోసం ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నెల 19న తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ రానుంది. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 30 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు విధించారు.
ఆపై ఏప్రిల్ 6వ తేదీ వరకు రూ.500 జరిమానాతో, ఏప్రిల్ 13వ తేదీ వరకు రూ.1000 జరిమానాతో దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.5 వేల ఫైన్ తో ఏప్రిల్ 20 వరకు, రూ.10 వేల జరిమానాతో ఏప్రిల్ 27 వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు.
అప్లికేషన్లలో సవరణలు చేసుకునేందుకు మార్చి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు గడువు విధించారు. ఏప్రిల్ 20 నుంచి మే 1వ తేదీ వరకు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేశారు.