Mahesh Babu: అచ్చం తమన్నాలా అదిరిపోయే స్టెప్పులేసి అబ్బురపర్చిన మహేశ్ కూతురు సితార.. వీడియో వైరల్‌

Mahesh Babu Daughter Sitara Viral Dance Video
  • 'డ్యాంగ్ డ్యాంగ్' పాటకు డ్యాన్స్
  • తమన్నాలా దుస్తులు
  • మరోసారి మహేశ్ అభిమానులను ఖుషీ చేసిన సితార
సామాజిక మాధ్యమాల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న మహేశ్ బాబు కూతురు సితారకు సంబంధించిన ఓ వీడియో నెటిజన్లను అబ్బురపరుస్తోంది.  'డ్యాంగ్ డ్యాంగ్' పాటకు సితార అదరగొట్టే స్టెప్పులు వేసింది. మహేశ్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలోని ఈ పాటకు అచ్చం తమన్నాలా డ్యాన్స్‌ వేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను మహేశ్ బాబు భార్య నమ్రత సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది.

మహేశ్‌ బాబు కొత్త సినిమాల్లోని పాటలు పాడడం, డ్యాన్సులు వేయడం సితారకు అలవాటే. గతంలోనూ తన తండ్రి సినిమా పాటలను పాడిన ఆమె వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ హల్‌చల్‌ చేసి, ఆ సినిమాలకు మరింత పబ్లిసిటీ తెచ్చిపెట్టాయి. 'డ్యాంగ్ డ్యాంగ్' పాటలో అచ్చం తమన్నాలాగే తయారై సితార హుషారుగా డ్యాన్స్ వేసింది. మహేశ్‌ బాబు అభిమానులను మరోసారి ఖుషీ చేసింది.
Mahesh Babu
Viral Videos
SarileruNeekevvaru

More Telugu News