PavanKalyan: క్రిష్ మూవీలో పవన్ నాయికగా నిధి అగర్వాల్

Krish Movie

  • పవన్ సినిమా కోసం రంగంలోకి దిగిన క్రిష్ 
  •  డేట్లు ఖాళీ లేవని చెప్పిన  స్టార్ హీరోయిన్స్
  • బందిపోటుగా కనిపించనున్న పవన్

తెలుగు తెరకి ఈ మధ్య కాలంలో పరిచయమైన అందమైన కథానాయికలలో నిధి అగర్వాల్ ఒకరు. 'మిస్టర్ మజ్ను' చిత్రం ద్వారా యూత్ హృదయాలను దోచేసిన ఈ సుందరి, ఆ తరువాత 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా ఆమె మరో అవకాశాన్ని దక్కించుకుంది. క్రిష్ సినిమాలో కథానాయికగా ఆమె ఎంపిక జరిగిపోయిందని తెలుస్తోంది.

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఎ.ఎమ్.రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆంగ్లేయులను దోచుకునే ఒక బందిపోటుగా పవన్ కనిపించనున్నాడు. ఆయన సరసన నాయిక పాత్ర కోసం కైరా అద్వానీని .. పూజా హెగ్డేను .. సోనాక్షి సిన్హాను సంప్రదించారు. వాళ్ల డేట్స్ ఖాళీ లేకపోవడం వలన, నిధి అగర్వాల్ ను తీసుకున్నారు. పారితోషికం తక్కువ కావడం వల్లనే నిధి అగర్వాల్ ను తీసుకున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది.

PavanKalyan
Nidhi Agarwal
Krish Movie
  • Loading...

More Telugu News