Prabhas: ప్రభాస్ తో తలపడే విలన్ గా జగపతిబాబు

O Dear Movie

  • ప్రభాస్ .. పూజా జోడీగా 'ఓ డియర్'
  • డిఫరెంట్ లుక్ తో జగపతిబాబు 
  •  హైదరాబాదులో జరుగుతున్న షూటింగ్

రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాతో ప్రభాస్ బిజీగా వున్నాడు. ఈ సినిమాలో ఆయన రొమాంటిక్ హీరోగా కనిపించనున్నాడు. ఆయన సరసన నాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. తాజా షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాదులో జరుగుతోంది. ప్రధాన పాత్రల కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జగపతిబాబు నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన పాత్రను చాలా డిఫరెంట్ గా మలిచినట్టు సమాచారం. ఇంతవరకూ చేయని పాత్రలో జగపతిబాబు కనిపించే తీరు ఒక రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. ఆయన లుక్ .. డైలాగ్ డెలివరీ కూడా విలక్షణంగా వుంటాయని చెబుతున్నారు. యూవీ క్రియేషన్స్ వారు .. కృష్ణంరాజు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా కోసం, 'ఓ డియర్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

Prabhas
Pooja Hegde
Jagapathi Babu
O Dear Movie
  • Loading...

More Telugu News