LPG: పెరిగిన వంటగ్యాస్ సిలిండర్ ధర

cooking Gas Prices hiked

  • ఆయా ప్రాంతాలను బట్టి రూ.149 వరకు పెంపు
  • ఢిల్లీలో సిలిండర్ ధర రూ.858.50
  • పెరిగిన ధరలు ఈరోజు నుంచి అమలు

సబ్సిడీయేతర వంట గ్యాస్ సిలిండర్ ధర మళ్లీ పెరిగింది. ఈ పెంపు ఆయా ప్రాంతాలను బట్టి 149 రూపాయల వరకు ఉండనుంది. ఈ మేరకు ప్రభుత్వ రంగంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు ఓ ప్రకటన చేశాయి. ఈ పెంపు వల్ల ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.858.50 చేరింది. కాగా సబ్సిడీ కింద వినియోగదారులకు ఇచ్చే మొత్తం రూ.153.86 నుంచి 291.48కు పెంచారు.

ధర పెంపువల్ల వినియోగదారుడిపై అదనంగా ఏడు రూపాయాల భారం పడే అవకాశముంది.  గత ఆగస్టు నుంచి సిలిండర్ ధరను కంపెనీలు ప్రతీ నెల పెంచుతున్నాయి. ఈ క్రమంలో తాజా పెంపు ఆరోది. చివరిసారిగా జనవరి 1న సిలిండర్ ధరను రూ.19 పెంచాయి. కాగా, పెరిగిన ధరలు ఈ రోజు నుంచే అమల్లోకి రానున్నాయని కంపెనీలు తెలిపాయి. ఈ పెంపు సామాన్యుడి బడ్జెట్ కు ప్రతిబంధకంగా మారాయి.

LPG
Cooking gas
Prices
cylinder
Hiked
India
  • Loading...

More Telugu News