Delhi Assembly Elections: సీఎంగా కేజ్రీవాల్ వేలెంటైన్స్ రోజే ప్రమాణ స్వీకారం?

Kejriwal Takes Oath as CM on Valentines day

  • 2015లో ఫిబ్రవరి 14న సీఎంగా ప్రమాణ స్వీకారం
  • తాజాగా ఈ నెల 14న సీఎంగా మళ్లీ ప్రమాణ స్వీకారం?
  • 2013లో డిసెంబర్ లో సీఎం ప్రమాణ స్వీకారం చేసిన కేజ్రీవాల్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఆప్’ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గెలిచినప్పుడు కూడా సీఎంగా కేజ్రీవాల్  ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14నే ప్రమాణ స్వీకారం చేశారు.

ఇప్పుడు కూడా ఆయన ఈ నెల 14న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ 2012లో ఏర్పాటైన తర్వాత మరుసటి సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కంటే తక్కువ స్థానాలు వచ్చినప్పటికీ.. 2013 డిసెంబర్ లో కాంగ్రెస్ తో కలిసి ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

అనంతరం కొన్ని రోజులకే కాంగ్రెస్ తో తలెత్తిన విభేదాలతో సీఎం పదవికి 2014 ఫిబ్రవరి 14న రాజీనామా చేశారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పూర్తి మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంగా కేజ్రీవాల్ ఫిబ్రవరి 14న  ప్రమాణ స్వీకారం చేశారు.  అలాగే ఇప్పుడు కూడా కేజ్రీవాల్ సీఎంగా ఫిబ్రవరి 14నే ప్రమాణం స్వీకారం చేస్తారని సమాచారం.

Delhi Assembly Elections
Arvind Kejriwal
Taking Oath
As CM on Valentines day
  • Loading...

More Telugu News