Sensex: కరోనా వైరస్ దెబ్బకు డీలా పడిన మార్కెట్లు

  • 900 దాటిన కరోనా వైరస్ మృతుల సంఖ్య
  • 162 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 66 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. కరోనా వైరస్ మృతుల సంఖ్య 900 దాటడం అంతర్జాతీయ మార్కెట్లతో పాటు మన మార్కెట్లపై కూడా ప్రభావం చూపింది. కరోనా దెబ్బకు ఈ రోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే నష్టాల్లోకి జారుకున్న సూచీలు...  ఆ తర్వాత మళ్లీ కోలుకోలేదు. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 162 పాయింట్లు నష్టపోయి 40,979కి పడిపోయింది. నిఫ్టీ 66 పాయింట్లు కోల్పోయి 12,031 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (1.51%), టీసీఎస్ (1.20%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (1.04%), ఏసియన్ పెయింట్స్ (0.62%), హెచ్డీఎఫ్సీ (0.27%).

టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-7.16%), టాటా స్టీల్ (-5.80%), ఓఎన్జీసీ (-2.84%), సన్ ఫార్మా (-2.39%), హీరో మోటో కార్ప్ (-2.34%).

  • Loading...

More Telugu News