upsc: ఈ నెల 12న సివిల్స్ నోటిఫికేషన్ విడుదల

  • వచ్చే నెల 3వ తేదీ వరకు దరఖాస్తులు
  • మే 31న ప్రిలిమినరీ పరీక్ష
  • షెడ్యూల్ విడుదల చేసిన యూపీఎస్సీ

ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి సివిల్ సర్వీసులకు ఈ ఏడాది ప్రిలిమినరీ పరీక్ష తేదీని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఖరారు చేసింది. దీనికి సంబంధించి ఈ నెల (ఫిబ్రవరి) 12న నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు సోమవారం ప్రకటించింది. యూపీఎస్సీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం..
  • 12వ తేదీన నోటిఫికేషన్ జారీ అవుతుంది.
  • మార్చి 3వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
  • మే 31వ తేదీన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు.
  • ‘upsconlinenic.in’ వెబ్ సైట్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ విడుదల చేశాక ఈ పోర్టల్ అందుబాటులోకి వస్తుంది.

అర్హత, ఇతర వివరాలివీ..
  • అప్లై చేసుకునేవారి కనీస అర్హత వయస్సు 21 ఏళ్లు. గరిష్టంగా 32 ఏళ్లు
  • ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీల వారికి ఐదేళ్లు మినహాయింపు ఉంటుంది. వారు 37 ఏళ్ల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఓబీసీ కేటగిరీ, డిఫెన్స్ సర్వీసులో ఉన్న వాళ్లకు మూడేళ్ల మినహాయింపు ఉంటుంది. వారు 35 ఏళ్ల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • యూపీఎస్సీ నోటిఫికేషన్లో పేర్కొనే తేదీ నాటికి  ఈ వయో పరిమితి వర్తిస్తుంది.
  • జనరల్ అభ్యర్థులు గరిష్టంగా ఆరుసార్లు సివిల్స్ పరీక్ష రాయవచ్చు. ఓబీసీలు గరిష్టంగా 9 సార్లు రాయొచ్చు.
  • ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వారికి నిర్ణీత పరిమితి అంటూ ఏదీ లేదు.
  • దరఖాస్తు చేసుకునే వారు డిగ్రీ, లేదా దానితో సమానమైన సర్టిఫికెట్ కోర్సు చేసి ఉండాలి.

  • Loading...

More Telugu News