Hindu: వినూత్న వివాహ వేడుకలు: ఒకే వేదికపై హిందూ, ముస్లిం జంటలకు పెళ్లిళ్లు

  • ఏకమైన 1100 హిందూ, ముస్లిం జంటలు
  • గుజరాత్ లోని అహ్మదాబాద్ లో వేడుకలు
  • ఈషా ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వివాహాలు
  • ఎనిమిదేళ్లుగా ఈ తరహా వివాహాలు జరిపిస్తున్నామని వెల్లడి

ఒకే వేదికపై హిందూ, ముస్లిం జంటలు ఏకమై మతసామరస్యాన్ని చాటిన సందర్భం గుజరాత్ లో చోటుచేసుకుంది. ఈషా పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గత ఎనిమిదేళ్లుగా తాము ఈ తరహా వివాహాలను జరుపుతున్నట్లు ట్రస్ట్ వెల్లడించింది.

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఒకే వేదికపై హిందూ, ముస్లిం మతాలకు చెందిన 1100మంది వధూవరులు వివాహ బంధంతో ఒక్కటయ్యారని ఈషా ఫౌండేషన్ ట్రస్ట్ ప్రకటించింది. వివాహ తంతు ముగిసిన తర్వాత ఈషా ఫౌండేషన్ ట్రస్ట్ నిర్వాహకులు హిందూ దంపతులకు భగద్గీతను, ముస్లింలకు ఖురాన్ గ్రంథాలను బహుమతిగా అందించారు.

Hindu
Muslim
At on dias marriages
Gujrat
Eesha Foundation
  • Loading...

More Telugu News