Rahul Gandhi: అన్ని రిజర్వేషన్లనూ తొలగించే ఆలోచనలో నరేంద్ర మోదీ: రాహుల్ గాంధీ ఆరోపణ

  • రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం
  • పూర్తిగా తొలగించే ప్రయత్నం జరుగుతోంది
  • అడ్డుకుని తీరుతామన్న రాహుల్ గాంధీ

దేశంలో అణగారిన వర్గాలకు, మైనారిటీలకు రిజర్వేషన్లు తొలగించే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ అడుగులు వేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ ఉదయం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని మండిపడ్డారు. సమీప భవిష్యత్తులో రిజర్వేషన్లను పూర్తిగా తొలగించేందుకు బీజేపీ ప్రయత్నం చేయనుందని, తాము దాన్ని అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. కాగా, ఎస్సీ, ఎస్టీలకు నియామకాలు, ప్రమోషన్లలో రిజర్వేషన్ల అమలు రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతేనని, దానిపై తామేమీ కొత్త ఆదేశాలు జారీ చేయబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Rahul Gandhi
Narendra Modi
Reservations
BJP
  • Loading...

More Telugu News