Vijay Devarakonda: గీతా ఆర్ట్స్ బ్యానర్లో మూడోసారి చేయనున్న విజయ్ దేవరకొండ

  • గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో రెండు హిట్లు 
  • విజయ్ దేవరకొండ క్రేజ్ ను పెంచిన సినిమాలు 
  • మూడో సినిమా పట్ల ఆసక్తిని వ్యక్తం చేసిన అల్లు అరవింద్

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా 'గీతా ఆర్ట్స్ 2' బ్యానర్లో వచ్చిన 'టాక్సీవాలా'.. 'గీత గోవిందం' సినిమాలు భారీ విజయాలను నమోదు చేశాయి. 'గీత గోవిందం' కొత్త ట్రెండ్ ను సృష్టించడమే కాకుండా, వసూళ్ల పరంగా కొత్త రికార్డులను సృష్టించింది. ఈ బ్యానర్లో విజయ్ దేవరకొండ మరో మూవీ చేయనున్నాడనే టాక్  ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా రూపొందిన 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రం, ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ వేదికపై అల్లు అరవింద్ మాట్లాడుతూ, విజయ్ దేవరకొండతో మరో సినిమా చేయాలనే ఆసక్తితో వున్నట్టుగా చెప్పారు. విజయ్ దేవరకొండ ఓకే అంటే తన వైపు నుంచి ఎలాంటి ఆలస్యం ఉండదని అన్నారు. దాంతో ఈ బ్యానర్లో విజయ్ దేవరకొండ మూడో సినిమా తెరకెక్కడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది.

Vijay Devarakonda
Allu Aravind
GA2 Pictures
  • Loading...

More Telugu News