Amaravati: దండాలయ్యా...మామొర ఇనండయ్యా! : రాజధాని రైతుల వినూత్న నిరసన

  • హైకోర్టుకు న్యాయమూర్తులు వెళ్లే దారిలో బారులు
  • దండం పెడుతూ ప్లకార్డుల ప్రదర్శన
  • 55వ రోజుకు చేరిన ఆందోళనలు

అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ గడచిన 55 రోజులుగా పలు రూపాల్లో ఆందోళనలు చేస్తున్న రైతులు ఈరోజు ఉదయం వినూత్న కార్యక్రమం చేపట్టారు. న్యాయమూర్తులు హైకోర్టుకు వెళ్లే దారిలో బారులు తీరి ‘దండాలయ్యా... మా మొర ఇనండయ్యా’ అంటూ వేడుకున్నారు. న్యాయమూర్తులు వచ్చే సమయంలో దండం పెడుతూ తమ గోడును తెలిపే ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ న్యాయమూర్తులైనా తమ మొర ఆలకిస్తారన్న ఉద్దేశంతో ఈ శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అలాగే, కృష్ణాయపాలెం శివాలయం సెంటర్‌లో గులాబీపూలు పంచుతూ రైతులు నిరసన తెలియజేశారు.

Amaravati
farmers
JAC agitation
judges
  • Loading...

More Telugu News