Kurnool District: మహిళా ఓటరు పేరుకి సినీ నటుడు వెంకటేశ్ ఫొటో.. కర్నూలు కార్పొరేషన్ ఓటర్ల లిస్టులో విచిత్రం!

  • ఎన్నికల కోసం సిద్ధమవుతున్న కర్నూలు అధికారులు
  • ఓటరు జాబితా విడుదల చేసి అభాసుపాలు
  • తప్పుల కుప్పలుగా ఓటర్ల జాబితా

స్థానిక సంస్థల ఎన్నికల కోసం సిద్ధమవుతున్న కర్నూలు నగర పాలక సంస్థ అధికారులు అందులో భాగంగా ఓటరు జాబితాను విడుదల చేసి అభాసుపాలయ్యారు.  టాలీవుడ్ అగ్రనటుడు వెంకటేశ్ ఫొటోను ఓ మహిళ ఫొటోకు బదులుగా వాడేసి విమర్శలు కొనితెచ్చుకున్నారు. రాణి కూమారోలూ  అనే 20 ఏళ్ల యువతి ఫొటోకు బదులుగా వెంకటేశ్ ఫొటో అచ్చయింది.

దీనిని ఏమాత్రం గుర్తించని అధికారులు ఆ జాబితాను అలానే విడుదల చేసేశారు. ఇదొక్కటే కాదు, ఇలాంటి తప్పులు చాలానే ఉన్నాయని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం అధికారుల దృష్టికి చేరడంతో ఎన్నికలకు ఇంకా సమయం ఉందని, కాబట్టి తప్పులను సరిచేసి కొత్త జాబితాను విడుదల చేస్తామని అంటున్నారు.

Kurnool District
Municipal Elections
voter list
Andhra Pradesh
Actor Venkatesh
  • Loading...

More Telugu News