Drunk Driving: పోలీసులపై కరోనా ఎఫెక్ట్.. బెంగళూరులో డ్రంకెన్ డ్రైవ్ లు బంద్!

  • వైరస్ దెబ్బకు హడలుతున్న పోలీసులు
  • పరీక్షలు వద్దని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు
  • మందు కొట్టినట్టు కనిపెడితే, ఇతర మార్గాల ద్వారా కేసులు

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు ట్రాఫిక్ పోలీసులు హడలిపోతున్నారు. వారాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి, మందు బాబుల ఆటకట్టించే పోలీసులకు, ఇప్పుడు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు వద్దని ఆదేశాలు అందాయి.

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆల్కోమీటర్ ద్వారా మద్యం పరీక్షలు చేయవద్దని ట్రాఫిక్ పోలీస్ హెడ్ రవికాంతే గౌడ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. అనేక మంది ఒకే ఆల్కో మీటర్ ద్వారా గాలిని ఊదడం వల్ల, ఎవరికైనా కరోనా వైరస్ సోకివుంటే, అది ఇంకొకరికి వ్యాపించే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

ఒకవేళ, వాహనదారులు ఎవరైనా మద్యం తాగినట్టు పోలీసులకు రూఢీగా తెలిస్తే, ఇతర మార్గాల ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించాలని రవికాంతే గౌడ ఆదేశించారు. ఏది ఏమైనా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు ఆగిపోవడంతో మందు బాబులు ఖుషీ అవుతున్నారు. 

Drunk Driving
Karnataka
Police
Test
  • Loading...

More Telugu News