Advani: ఓ హిందీ సినిమా చూసి తీవ్ర భావోద్వేగాలకు లోనైన అద్వానీ
- విధు వినోద్ చోప్రా దర్శకత్వంలో వచ్చిన 'శిఖర: ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ కశ్మీరీ పండిట్స్'
- ప్రత్యేక ప్రదర్శన తిలకించిన అద్వానీ
- క్లైమాక్స్ చూస్తూ కంటతడి
బాలీవుడ్ దర్శక దిగ్గజం విధు వినోద్ చోప్రా తాజాగా 'శిఖర: ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ కశ్మీరీ పండిట్స్' అనే సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించగా, బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ కూడా తిలకించారు. అయితే ఈ సినిమా చూసిన అద్వానీ భావోద్వేగాలకు గురయ్యారు.
క్లైమాక్స్ చూస్తున్న సందర్భంగా ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకోవడానికి ప్రయత్నించగా, అక్కడే ఉన్న దర్శకుడు విధు వినోద్ చోప్రా వచ్చి ఓదార్చారు. కశ్మీర్ ప్రాంతానికి చెందిన విధు వినోద్ చోప్రా 'శిఖర: ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ కశ్మీరీ పండిట్స్' చిత్రాన్ని తన మాతృమూర్తికి అంకితం ఇచ్చారు. 90వ దశకం తొలినాళ్లలో కశ్మీర్ లో పండిట్ల నివాసాలపై టెర్రరిస్టులు దాడులు చేయడం, ఉగ్రదాడుల భయంతో కశ్మీరీ పండిట్లు ఇళ్లు వదిలి పారిపోవడం ఇతివృత్తంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.