Team New Zealand: భారత్ ను క్లీన్ స్వీప్ చేస్తామంటున్న న్యూజిలాండ్ కెప్టెన్

  • వన్డే సిరీస్ చేజిక్కించుకున్న కివీస్
  • ఎల్లుండి చివరి వన్డే
  • ఆ మ్యాచ్ లోనూ తమదే విజయం అంటున్న లాథమ్

కివీస్ పర్యటనలో టీమిండియా వన్డే సిరీస్ ను కోల్పోయిన సంగతి తెలిసిందే. వరుసగా రెండు వన్డేల్లో నెగ్గిన న్యూజిలాండ్ 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఇరు జట్ల మధ్య చివరి వన్డే ఎల్లుండి జరగనుంది. ఈ నేపథ్యంలో, కివీస్ తాత్కాలిక కెప్టెన్ టామ్ లాథమ్ స్పందిస్తూ, మూడో వన్డేను కూడా గెలిచి సిరీస్ ను 3-0తో ముగిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. తమ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారని కొనియాడాడు. మొదటి వన్డేలో బ్యాట్స్ మెన్ పోరాడితే, రెండో మ్యాచ్ లో బౌలర్లు ప్రతిభ చూపారని ప్రశంసించాడు. కొత్త కుర్రాడు కైల్ జేమీసన్ అటు బ్యాట్ తో ఇటు బంతితో అమోఘంగా రాణించాడని కితాబిచ్చాడు. సిరీస్ క్లీన్ స్వీప్ లక్ష్యంగా చివరి వన్డేలో బరిలో దిగుతామని లాథమ్ స్పష్టం చేశాడు.

Team New Zealand
Team India
ODI Series
ODI
Tom Latham
Cricket
  • Loading...

More Telugu News