Panchumarthi Anuradha: గ్లోబల్ మీడియా క్రెడిబులిటీని తప్పుబట్టే స్థాయికి వైసీపీ చేరింది!: పంచుమర్తి అనూరాధ

  • ‘కియా’ అనుబంధ పరిశ్రమలు వెళ్లిపోయిన మాట వాస్తవం కాదా?
  • ‘రాయిటర్స్’ కథనంపై ఏపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు?
  • వైసీపీ చెప్పింది చేయలేక కియా ఇబ్బంది పడుతోంది

ఏపీ నుంచి ‘కియా’ పరిశ్రమ తరలిపోతోందంటూ తప్పుడు కథనాలు రాసిందని ‘రాయిటర్స్’ వార్తా సంస్థపై నిప్పులు చెరుగుతున్న వైసీపీ ప్రభుత్వం ఆ సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోలేదని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ ప్రశ్నించారు. కియా అనుబంధ పరిశ్రమలు ఏపీ నుంచి వెళ్లిపోయిన మాట, ఈ సంస్థ సీఈఓ ను ఎంపీ మాధవ్ బెదిరించింది వాస్తవం కాదా? ఏపీ నుంచి ‘కియా’ తరలిపోవాలని ఏపీ ప్రభుత్వం కనుక అనుకోకపోతే ఆ వార్తా సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని ప్రశ్నించారు.

గ్లోబల్ మీడియా క్రెడిబులిటీని తప్పుబట్టే స్థాయికి వైసీపీ చేరిందని విమర్శించారు. వైసీపీ చెప్పింది చేయలేక, లంచాలు ఇవ్వలేక, కియా ఇబ్బంది పడుతోందని, వైసీపీ ప్రభుత్వ విధానాలు చూసి చాలా కంపెనీలు ఏపీ నుంచి వెళ్లిపోయాయని విమర్శించారు. ఏపీని బీహార్ కన్నా దారుణమైన స్థితికి తీసుకెళ్లారంటూ వైసీపీ ప్రభుత్వంపై ఆమె నిప్పులు చెరిగారు.

Panchumarthi Anuradha
Telugudesam
YSRCP
KIA Motors
  • Loading...

More Telugu News